చంద్రయాన్-3 మరింత ఆలస్యం

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపించిన విధంగానే చంద్రయాన్ పరిశోధనలపై చూపించింది. చంద్రుడిపైకి పంపించే మూడో మిషన్ చంద్రయాన్-3 మరింత ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
ఈ ఏడాది బదులు వచ్చే ఏడాదిలో పంపించనున్నట్లు ఇస్రో చీఫ్ కె.శివన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2020 లో అమలు చేయాల్సి ఉంది. దీంతో పాటు గగన్ యాన్ కూడా ఆలస్యమైంది.

చంద్రయాన్-3 గురించి వివరిస్తూ ఆర్బిటర్ ఉండదని అన్నారు. చంద్రయాన్-2లో ఉన్న ఆర్బిటర్ నే చంద్రయాన్-3లో వాడుకుంటున్నామన్నారు. చంద్రయాన్-2 చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ కూలిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది డిసెంబర్ లో గగన్ యాన్ ప్రాజెక్టులో మానవ రహిత మిషన్ పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తరువాత మరో మానవ రహిత మిషన్ ను పంపించనున్నారు. చిట్ట చివరగా మానవ సహిత రాకెట్ వెళ్తుందని ఇస్రో చీఫ్ శివన్ వెల్లడించారు. 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇందుకోసం నలుగురిని ఎంపిక చేశామన్నారు. ఆ నలుగురికి రస్యాలో శిక్షణనిప్పిస్తున్నామని శివన్ వివరించారు.

chandrayaan-3Chandrayaan-3 further delayedlatest telugu newsTelugu breaking newstelugu newsThird Mission Chandrayaan-3