కారు ఆక్సిడెంట్… కిలో బంగారం లభ్యం

పెద్దపల్లి: రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇవాళ తెల్లవారు జామున కారు అదుపుతప్పి బోల్తా పడగా ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో  కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారు ఆంద్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులుగా గుర్తించారు. తెలంగాణలో బంగారం అమ్మడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

car accidentlatest telugu newsTelugu breaking newstelugu newstwo killed