వీడియో గేమ్స్ ఆడొద్దని అన్నందుకు…

చిత్తూరు: పలమనేరు లో వీడియో గేమ్స్ ఆడొద్దని తల్లి మండలించడంతో బాలుడి (14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పలమనేరు లోని శ్రీనగర్ కాలనీ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. నిత్యం ఆటలు ఆడుతుండడంతో తల్లి తీవ్రంగా మందలించి చేయి చేసుకున్నది. మనస్థాపానికి గురైన బాలుడు ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కిందకు దించారు. హుటాహుటిన పలమనేరు లో ప్రథమ చికిత్స చేయించారు.

పరిస్థితి చేయిదాటుతోందని వైద్యులు చెప్పడంతో తిరుపతి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ఈ ఉదయం చనిపోయినట్లు పలమనేరు పోలీసులు తెలిపారు.

boy committed suicidecrime newslatest telugu newssuicide attemptTelugu breaking newstelugu news