కిడ్నాప్ నిందితుడు బెంగళూర్ లో

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక సూత్రధారి ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి భర్త భార్గవ రామ్ ఆచూకీ లభించింది. కర్ణాటకలోని బెంగళూర్ లో ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం లభించింది.

హఫీజ్ పేట భూ వివాదంలో ముగ్గురిని అపహరించడం కోసం కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందిన 15 మందిని ఎంపిక చేశాడు. వారిని హైదరాబాద్ కు రప్పించి కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ తరువాత నిందితులు పోలీసులకు దొరక్కుండా టోల్ ప్లాజాలు లేని సర్వీసు రోడ్ల ద్వారా బెంగళూరు నగరానికి పారిపోయారు.

నిందితుడు భార్గవ రామ్ కు నేర చరిత్ర ఉందని, ఆ చిట్టాను పోలీసులు సికింద్రాబాద్ కోర్టు కు తెలిపారు. సెటిల్ మెంట్ల కోసం బాధితులను భౌతికంగా ఆర్థికంగా దెబ్బతీసేందుకు కూడా వెనకాడబోడని తన నివేదికలో వెల్లడించారు.

Bhuma Akhilapriya ReddyBoin Palli kidnapping caselatest telugu newsTelugu breaking newstelugu news