యూ టర్న్ ‘‘సీఎం కేసీఆర్’’: బండి ఎద్దేవా

హైదరాబాద్: గౌరవనీయులు, పూజ్యులు, మా గురువర్యులు సీఎం కేసీఆర్ యూ టర్న్ ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యూరియా ఫ్రీ అన్నాడు.. యూ టర్న్ తీసుకున్నాడు, కరోనా లేదు , పారసిటమల్ అన్నాడు, మాస్క్ లు వద్దన్నాడు.. లేకుండా నే తిరుగుతా అన్నాడు.. యూ టర్న్ తీసుకున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు.

తాజాగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ల పై యూ టర్న్ తీసుకున్నాడు, రైతు చట్టాల విషయం లో యూ టర్న్, చివరికి యూ టర్న్ తీసుకొని పాస్ పోర్టు ల బ్రోకర్ అవుతాడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆయన… తుగ్లక్ ని మించిపోయాడని అన్నారు. సీఎం చిత్తశుద్ధి తో అమలు చేస్తే ఒకే.. అబద్ధాల ముఖ్యమంత్రి ఏదన్నా కుట్ర చేస్తున్నాడా అనే చర్చ జరుగుతోందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు తీసివేయాలని చట్టంలో ఎక్కడ ఉంది.. కొనుగోలు కేంద్రాలు తీసేయడం లో ఆంతర్యం ఏంటి ? అని అయన ప్రశ్నించారు.

రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నందున వాటిని కొనుగోలు కేంద్రాలు గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్ని రోజుల వ్యాపారం చేశామని ఒప్పుకున్నావ్.. బ్రోకరిజం చేశావని అంగీకరించావన్నారు. ఇప్పుడు నీ కుట్రలకు రైతులు మద్దతు ఇవ్వకపోవడంతో కొత్త కుట్రకు తెరలేపావ ని అనుమానం వస్తోందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ యాప్ ని బండి సంజయ్ అవిష్కరించారు.

BJP state president Bandi Sanjaycm kcrlatest telugu newsTelugu breaking newstelugu news