బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

* రైతులకు, బ‌ర్డ్ ఫ్లూకు లింకు
జైపూర్: దేశంలో ఓ పక్క బర్డ్ ఫ్లూ తీవ్రంగా వ్యాపిస్తుండగా.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. అయితే ఏ మాత్రం సంబంధం లేని ఈ రెంటికీ లింకు పెడుతూ.. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దిలావర్ బ‌ర్డ్ ఫ్లూకు కార‌ణం రైతులేనంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద రైతులు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తూ.. రైతులు అక్కడే చికెన్ తింటూ దేశంలో బర్డ్ ఫ్లూని వ్యాపింప జేస్తున్నారని ఆరోపించారు. అలాగు ఆందోళ‌న‌లో కూర్చొని హాయిగా రుచిక‌ర‌ వంటకాలు తింటూ, పిక్నిక్ చేసుకుంటున్నారన్నారు. తాజా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

BJP MLA Dilawarlatest telugu newsTelugu breaking newstelugu news