రైతుకు మిగిలేదేమిటో కేసీఆర్ చెప్పాలి: విజ‌య శాంతి

హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులకు మిగిలేదేమిటో చెప్పాలంటూ బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రైతుల విష‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు.

సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయన్నారు.

BJP leader Vijayashanticm kcrlatest telugu newsTelugu breaking newstelugu news