బిల్‌గేట్స్‌ దంపతుల డైవర్స్

సియాటిల్‌: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ఆయన సతీమణి మెలిండా తో విడాకులు తీసుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ట్విట్ చేశారు.

ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. విడాకులకు ముందు ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చామన్నారు. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశామని బిల్ గేట్స్ ట్విటర్ లో తెలిపారు. గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు కాగా 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు.

Billgates Couple Diverslatest telugu newsTelugu breaking newstelugu news