జార్జ్ ప్లాయిడ్ చట్టాన్ని తెస్తున్నాం: బైడెన్

వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ పేరిట అర్థవంతమైన పోలీసు సంస్కరణ చట్టాన్ని తెస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ తెలిపారు. ఈ చట్టం తీసుకురావడానికి సంవత్సర కాలం తీసుకోవాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారి డెరిక్ చౌవిన్ ను దోషిగా నిర్థారిస్తూ మిన్నెసోటా కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై బైడెన్ ట్విటర్ వేదికగ స్పందించారు. దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ ఎక్కువ కాదన్నారు. ఆ దిశలో ఈరోజు వచ్చిన తీర్పు మంచి సందేశాన్ని ఇచ్చింది. ఇది సరిపోదని, ఇక్కడితో మనం ఆగిపోకూడదన్నారు. వ్యవస్థలో నిజమైన మార్పులు తీసుకురావాలని, ఇలాంటి విషాద ఘటనలు తగ్గించాంలా మనం తప్పక కృష్టి చేయాలని బైడెన్ అన్నారు. నాకు శ్వాస ఆడటం లేదు (ఐ కాంట్ బ్రీత్) అన్న జార్జ్ చివరి మాటలను గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ తీర్పు అమెరికా న్యాయ వ్యవస్థలో గొప్ప ముందడుగు అని అన్నారు.
అమెరికాలో గతేడాది శ్వేతజాతి పోలీసు అధికారి డెరిక్ చౌవిన్ హింస కారణంగా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియో వైరల్ అయ్యి, దేశంలో హింసకు దారితీసిన విషయం విదితమే.

George Plaid Actlatest telugu newsTelugu breaking newstelugu newsU.S. President Joseph R. Biden