12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం

చిత్తూరు: 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్చేరిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాట్చేరిలో నాగరాజు (నిందితుడు) అనే యువకుడు ఓ 12 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిపేందుకు యత్నించాడు. బాలిక నిలువరించడంతో బాలికకు తీవ్ర గాయాలైనాయి. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

12-year-old girlAttempt to sexually assaultlatest telugu newsTelugu breaking newstelugu news