ఉప ఎన్నిక పిటిషన్ పై వాదనలు

అమరావతి: తిరుపతి ఉపఎన్నిక రద్దుపై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు రిజిస్ట్రీ ని ఆదేశించింది.
ఉపఎన్నిక రద్దు చేయాలని బిజెపి అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వాళ విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పిటిషన్‌పై డివిజన్ బెంచ్‌ విచారణ చేపట్టాలని రత్నప్రభ తరపు న్యాయవాది కోరారు. ఉప ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ వేశామని, బిజెపి దాఖలు చేసిన రెండు పిటిషన్లను కలిపి విచారించాలని టీడిపీ తరపు న్యాయవాది కోర్టు ను కోరారు. దీనిపై రిజిస్ట్రీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.

Arguments on By-Election Petitionlatest telugu newsTelugu breaking newstelugu news