తెలుగోళ్లం.. మాకు కుల‌మే ప్రాణం!

రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వుల‌ను ప్ర‌భుత్వాలు గౌర‌వించాలి. వ్య‌క్తిగ‌త ఇష్టాయిస్టాల‌తో సంబంధం లేకుండా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. ఇది రాజ్యాంగంలో పొందుప‌ర‌చిన అంశం. రాజ‌కీయ‌నాయ‌కులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారులు కూడా ఈ నిబంధ‌న‌ను పాటిస్తామంటూ ప్ర‌మాణం చేస్తారు. కానీ.. ఆచ‌ర‌ణ‌లో దాన్ని వ‌మ్ము చేస్తుంటారు. ఏపీలో కుల‌రాజ‌కీయాల న‌డుమ జ‌రుగుతున్న‌ది ఇదేనేమో అనిపిస్తుంది. వాస్త‌వానికి పుట్టుక‌తో వ‌చ్చిన కులానికి క‌ట్టుబ‌డే న‌డ‌వాలి. అదే స‌మ‌యంలో ఇత‌ర కులాల ఆత్మాభిమానాన్ని గౌర‌వించాలి. ముఖ్యంగా ఉత్త‌రాధిన బిహార్‌, యూపీ, మ‌ద్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కుల‌రాజకీయ‌మే అధికారాన్ని క‌ట్ట‌బెడుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ కులం ప్రాధాన్య‌త ఉన్నా.. తెలంగాణ‌లో కుల ప్ర‌భావం అంత‌గా ఉండేది కాదు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014 ఎన్నిక‌ల్లో కొంత‌మేర కుల స‌మీక‌ర‌ణలు మారాయి. క‌మ్మ, కాపు క‌ల‌యిక‌తో కొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. కానీ.. 2019 నాటికి ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. క‌మ్మ వ్య‌తిరేక‌త‌ను బూచిగా చూపుతూ టీడీపీను భారీగా దెబ్బ‌తీశారు. కొంద‌రు ఎమ్మెల్యేలు కూడా దీనికి బలాన్నిచ్చేలా చేయ‌టంతో వ్య‌తిరేక‌త మరింత పెరిగింది. కొంద‌రు ఉన్న‌తాధికారులు కూడా ప్ర‌భుత్వం త‌మ చేతుల్లో ఉంద‌నేలా వ్య‌వ‌హ‌రించ‌టం టీడీపీ ప‌ట్ల సామాన్యుల్లో వెగ‌టు పుట్టించేలా చేసింది. ఇప్పుడు అదే మార్గంలో వైసీపీ కూడా అడుగులు వేస్తుంది. కేవ‌లం ఒకే వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌నిస్తుందనేది బ‌హిరంగంగా తెలుస్తూనే ఉంది.

టీడీపీ హ‌యాంలో ఉన్న‌త‌హోదాలో ప‌నిచేసిన క‌మ్మ వ‌ర్గానికి చెందిన అధికారుల‌పై క‌క్ష‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. ఐటీ అధికారి జాస్తి కృష్ణ‌కిషోర్‌, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏ.బి.వెంక‌టేశ్వ‌రావు, ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ముగ్గురూ వైసీపీ అధికారంలోకి రాగానే బ‌ల‌య్యారు. చంద్ర‌బాబు ప‌ట్ల విదేయ‌త‌గా ఉన్నార‌నే ఒకే ఒక్క కార‌ణంతో ముగ్గురుఅధికారుకూ ఏడాది కాలంలో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. జాస్తి కిషోర్‌కు కేంద్రం ప్ర‌మోష‌న్ ఇచ్చి జీఎస్‌టీ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెన్ష‌న్ ను న్యాయ‌స్థానం త‌ప్పుబ‌ట్టింది. తాజాగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స‌స్పెన్ష‌న్ త‌ప్పంటూ అత్యున్న‌త‌ న్యాయ‌స్థానం స‌ప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. ప్ర‌భుత్వ ఉద్దేశం స‌రిగా లేదంటూ త‌ప్పుబ‌ట్టింది. తుది విచార‌ణ‌ను మూడు వారాల‌పాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఇది కేవ‌లం వైసీపీ హ‌యాంలోనే కాదు.. టీడీపీ అధికారంలో ఉన్న‌పుడు ఒక్క క‌మ్మ వ‌ర్గం మిగిలిన సామాజిక‌వ‌ర్గాల అధికారులు, నేత‌లు ప్రేక్ష‌కులుగా.. ప‌వ‌ర్‌లేని శాఖ‌ల్లో మ‌గ్గారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఇదంతా రివ‌ర్స్ అయ్యేది. అది 2020 నాటికి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ స్థానంలోకి వైసీపీ వచ్చింది. కానీ.. హ‌స్తం పార్టీను మించేలా మారింద‌నే విమ‌ర్శ‌ల‌కు ఊపిరిపోస్తుంది.

AP Political Special storylatest telugu newsTelugu breaking newstelugu news