ఏపిలో ఆక్సిజన్ ఫుష్కలం: ఎకె.సింఘాల్ వెల్లడి

అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కోసం ప్రభుత్వ కాల్‌ సెంటర్లకు వచ్చే విజ్ఞప్తులు తగ్గుతున్నాయని ఏపి వైద్య ఆరోగ్య శాఖ అనిల్ కుమార్ సింఘాల్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత లేకుండా చేశామన్నారు.

ఇవాళ మంగళగిరిలో సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,01,330 నమూనాలను పరీక్షించగా 23,160 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయన్నారు. గడచిన 24 గంటల్లో 106 చనిపోయారు. తాజాగా నమోదు అయిన వాటితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,98,532కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 9,686 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు సింఘాల్ తెలిపారు.

AP Medical Health Minister Anil Kumar Singhallatest telugu newsTelugu breaking newstelugu news