ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

అమరావతి: కారుణ్య నియామకాల్లో కొడుకు ఎంతో, కూతురు‌ కూడా అంతే అని హైకోర్టు జస్టిస్ దేవానంద్ స్పష్టం చేశారు. పెళ్లయినా తల్లిదండ్రులతో అనుబంధం విడదీయరానిదని, కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారున్నారని గుర్తు చేశారు.
తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు చేస్తున్న వారినీ చూస్తున్నాం, అవివాహితకే కారుణ్య నియామకాలనే నిబంధన ఇకపై చెల్లదని జస్టిస్ దేవానంద్ ఆదేశించారు. చిన్నమ్మ‌ అభ్యర్థనను‌ పరిగణలోకి తీసుకుని ఉద్యోగం కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన చిన్నమ్మ అనే మహిళ పటిషన్ పై ఈ తీర్పు వెలువరించారు. 2009లో ఆర్టీసీ డ్రైవర్ గా ఉన్న చిన్నమ్మ భర్త మృతి చెందగా, కారుణ్య నియామకానికి ఆమె ఏపీఎస్ఆర్టీసిని అభ్యర్థించింది. ఉద్యోగానికి సరైన అర్హతలు లేదంటూ చిన్నమ్మను తిరష్కరించింది.

తనకు ఇవ్వడం లేనందున తన వివాహిత కూతురు దమయంతికి ఉద్యోగం ఇవ్వాలని మరో అభ్యర్థన చేసింది. వివాహిత అయిన కూతురు కారుణ్య నియామానికి అర్హత లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం మరోసారి తిరస్కరించింది. ఆర్టీసీ తిరస్కరణపై చిన్నమ్మ 2014లో హైకోర్టును ఆశ్రయించింది. బ్రెడ్ విన్నర్ స్కీం‌ కింద ఉద్యోగి మరణిస్తే కుమారుడు లేదా అవివాహిత అయిన కూతురికి మాత్రమే ఉద్యోగ కల్పన ఉంటుందని ఆర్టీసీ తరపు న్యాయవాది వాదనలు విన్పించారు. 1999లో జారీ చేసిన 350 జీఓ ప్రకారం ఒక కూతురు ఉండి ఉంటే వివాహిత అయినా ఉద్యోగ కల్పన ఉంటుందని 2003లో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి గుర్తు చేశారు.

ap high courtAP High Court sensational verdictlatest telugu newstelugu brweaking newstelugu news