థియేటర్లలో 50 శాతం మించొద్దు: ఏపి ప్రభుత్వం

అమరావతి: కరోనా కేసులు తగ్గించేందుకు, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపి ప్రభుత్వం సినిమా థియేటర్లలో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేందుకు చర్యలు చేపట్టింది.
స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 50 శాతం పరిమితితోనే ప్రజారవాణాకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే టికెట్లు విక్రయించాలని పేర్కొంది. భద్రతా చర్యలు, వైద్యంపై ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ తో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపింది.

రాష్ట్రంలో కరోనా చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. రెమిడెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపింది. రెమిడెసివిర్‌ కొరత ఉంటే హెల్ఫ్‌ లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని ప్రజలను కోరింది. ఆసుపత్రులలో ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నామని, ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటించింది.

Ap GovernmentTelugu breaking newstelugu latestb newstelugu news