ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జులు వీరే…

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ముఖ్యనేతలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇన్‌ఛార్జ్లు, సమన్వయకర్తలను నియమించారు. అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలోనూ ఈ నియామకాలు చేపట్టారు. 13 జిల్లాలకు ఇన్‌ఛార్జ్లను నియమించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను జీవీఎల్‌ నరసింహరావు, కె.హరిబాబు, మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథ రాజులకు అప్పగించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణలను నియమించారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌బాబుకు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించి సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలకు బాధ్యతలు ఇచ్చారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్‌, పార్థసారథి, వరదాపురం సూరిలను నియమించారు. పార్టీ అభ్యర్థుల ఖరారు, గెలుపు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే ఎన్నికలను నిర్వహించనున్న జారీ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

BJP state president Somu Veerajulatest telugu newsTelugu breaking newstelugu news