యాంటిబాడీ పరీక్ష రూ.75 మాత్రమే

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో కొందరు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న తరువాత యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయా లేదా అనేది తెలుసుకునేందుకు డయాగ్నిస్టిక్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు.
మరికొందరు తాము కరోనా బారిన పడ్డామా లేదా అనేది తెలుసుకునేందుకు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు. డయాగ్నిస్టిక్ సెంటర్లు ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.2500 వరకు వసూలు చేసి టెస్టులు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నాయి. వంద శాతం మంది ఒకశాతం లోపు వారికి మాత్రమే యాంటీబాడీలు అభివృద్ధి చెందడం లేదు. యాంటీబాడీల ఆవశ్యతను పరిగణనలోకి తీసుకున్ని డి.ఆర్.డి.ఓ డిప్ కొవాన్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. డి.ఆర్.డి.ఓ లోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిల్లీలోని వ్యాన్ గార్డ్ డయాగ్నస్టిక్స్ తో కలిసి ఈ కిట్ ను అభివృద్ధి చేశారు. దీనికి గత నెల ఐసిఎంర్ ఆమోదం తెలపగా ఈ నెల కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లభించాయి.

ఒక వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా, యాంటీబాడీలు వృద్ధి చెందాయా, అవి ఏ స్థాయిలో ఉన్నాయి అనే విషయాలు ఈ కిట్ తో తెలుసుకోవచ్చు. కరోనాలోని స్పైక్ ప్రొటీన్, న్యుక్లియో క్యాపైడ్ ప్రొటీన్లను విశ్లేషించి శరీరంలోని యాంటీబాడీలను 99 శాతం కచ్చితత్వంతో అంచనా వేస్తుంది. బహిరంగ మార్కెట్ లోకి వచ్చ నెల జూన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కో కిట్ సాయం తో వంద పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఒక్కొక్కరి పరీక్షకు కనీసం ఒక గంట పదిహేను నిమిషాల సమయం తీసుకోనున్నది.

antibody testantibody test costDefense Institute of Physiology and Allied Scienceslatest telugu newsTelugu breaking newstelugu news