విశాఖలో మరో అగ్నిప్రమాదం

విశాఖ ఫార్మాసిటీలో నిన్న రాత్రి మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో జేపీఆర్ ల్యాబ్స్‌లో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మూడుసార్లు భారీగా పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగకమ్ముకుంది. ప్రమాద సమయంలో కంపెనీలో 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

crime newsfire in VisakhapatnamJPR Labslatest telugu newsTelugu breaking newstelugu newsVisakha Pharmacy