ఆనందయ్య మందు… జంతువులపై ప్రయోగం!

అమరావతి: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు అనేక మలుపులు తిరుతున్నది. నిన్నటి వరకు ఆయుష్ అధికారులు పరిశీలించగా తాజాగా జంతువులపై ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆనందయ్య మందుపై అనుమతి వస్తే సృజన లైఫ్ ల్యాబ్ లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారని వైసిపి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఎలుకలు, కుందేళ్లపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి నివేదిక ఇస్తారన్నారు. ఈ ప్రయోగాలకు 14 నుంచి 28 రోజుల వరకు సమయం పడుతుందన్నారు. దశాబ్ధంన్నర కాలంగా సృజన ల్యాబ్ లో జంతువులపై ప్రయోగాలు జరుపుతున్నారు. కరోనా ఉన్న జంతువుల కంటిపై మందు వేసి పరీక్షించాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే జంతువులకు కరోనా వైరస్ సోకించి, పరీక్షించే వ్యవస్థ వారి వద్ద లేని చెవిరెడ్డి తెలిపారు.

Anandayya drug experiment on animals!Krishnapatnam Anandayya Ayurvedic medicinelatest telugu newsTelugu breaking newstelugu news