ఆయనకి పిచ్చి ముదిరింది: అంబటి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతి ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు మాటల యుద్ధం పెంచేశారు. మరో పక్క ఎస్ఈసీ రమేష్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

తాజాగా.. వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ‘‘తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. పిచ్చిముదిరింది‘‘ అని ట్వీట్ చేశారు.

ambati comentsAmbati RambabuApbreaking news in telugulatest news in telugupolitical newsTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu