అంత ప్రమాదమా!

ప్రపంచంలో వాహనాల వాడకం బాగా పెరిగిపోఇంది. కొన్నాళ్ల నుంచి ఇండియాలో కూడా వాహనాల సంఖ్య బాగా పెరిగింది. దీనికి తోడు పరిశ్రమలు కూడా బాగానే పెరుగుతున్నాయి. పరిశ్రమలు పెరిగితే మంచిదే కదా.. ఇందులో అంత ప్రమాదమేం ఉంది అనేగా మీ అనుమానం. కరక్టే మీ అనుమానం. పరిశ్రమలు, వాహనాల సంఖ్య పెరిగితే ప్రజలకు ఉద్యోగాలు లభించడంతో పాటు అనేక సౌకర్యాలు కూడా కలుగుతాయి. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ, అవే ఇప్పుడు ఇండియా కొంపు ముంచుతున్నాయట. అది ఎంతగా అంటే నమ్మలేనంతగా, అమ్మో అనిపించేలా. అదేనండి వాహనాల వాడకం, పరిశ్రమల ద్వారా ఇండియాలో వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందట. అది ఎంతగా అంటే ఇండియాలో వాయు కాలుష్యం వల్ల ఒక్క 2019 సంవత్సరంలోనే దేశంలో 17లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారట. వాయు కాలుష్యం వల్ల లక్షలాది మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారట. ఈ విషయాలను యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్యూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ తెలిపింది.

వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏడాదీ 36.6శాతం మంది ఇండియాలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని కూడా తెలిపింది. వీరికి చికిత్స వ్యయం, పనిచేసే పరిస్థితి లేకపోవడంతో ఏటా జీడీపీలో రూ.2.60లక్షల కోట్లను కోల్పోవాల్సి వస్తుందని కూడా వివరించింది. చూశారా మనం నిత్యం చూస్తున్న పొగ ఎంత ప్రమాదకరంగా తయారైందో. దీని ప్రభావం నానాటికీ పెరుగుతుండడం కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సో, ఇప్పటికైనా మనమంతా మేల్కొని పర్యవరణాన్ని పెంచే కార్యక్రమాలను చేబట్టి వాయు కాలుష్యాన్ని నియంత్రించకుంటే మనం, మన కుటుంబాలు కూడా ఇదే మహమ్మారి బారిన పడాల్సిన ప్రమాదం రావచ్చు. అందుకే అంతా బీకేర్‌ఫుల్‌గా ఉండాలి మరి.

Air PollutionAir pollution in Indialatest telugu newsTelugu breaking newstelugu news