బేస్ బాల్ స్టేడియంలో కాల్పులు… 4గురు మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యంలో కాల్పులు జరగపోతేనే ఆశ్చర్యపోవాలి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంటునే ఉంటాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతారు.

వాషింగ్టన్ డిసి బేస్ బాల్ స్టేడియం వెలపల దుండగులు కాల్పలకు తెగబడ్డంతో నలుగురు అమాయకులు చనిపోయారు. నేషనల్ పార్క్ బేస్ బాల్ స్డేడియంలో శనివారం మ్యాచ్ జరుగుతున్నది. స్టేడియం క్రీడాభిమానులతో నిండిపోయింది. వాషింగ్టన్ నేషనల్స్, సాండియాలో టీముల మధ్య ఆట ఆరంభం కాగానే వెలపల నుంచి కాల్పుల శబ్ధాలు విన్పించాయి. తిలకించేందుకు వచ్చిన క్రీడాభిమానులు కూర్చీలను వదిలేసి పరుగులు తీశారు. క్రీడాకారులు పిచ్ ను వదిలి రూములకు వెళ్లిపోయారు. దుండగులు 12 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాల్పుల ఘటనతో మ్యాచ్ ను రద్దు చేసి నిందితుల కోసం వాషింగ్టన్ లో తనిఖీలు ముమ్మరం చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu news