భారత్ లో కొత్తగా 18 వేల కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన ఒక్కరోజే కొత్తగా 18,855 మంది కరోనా బారిన పడ్డారు.

అదే సమయంలో కరోనాతో 163 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 20,746 మంది కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,20,048 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,54,010కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 1,03,94,352 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 1,71,686 యాక్టివ్‌ కేసులున్నాయి.

breaking news in telugucoronaindia coronakovid-19latest news in teluguTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu