పొగమంచుతో 10 వాహనాలు ఢీ

గుంటూరు: పొగమంచు కారణంగా రోడ్డుపై దున్న కన్పించకపోవడంతో పిడుగురాళ్ళ మండలం వీరాపురం శాంతి నగరం గ్రామాల వద్ద పెద్ద ప్రమాదం జరిగింది.

సంఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డుపై మంచు కారణంగా ఏమీ కనిపించక ఒక లారీ ఆ దున్న ను ఢీకొనడం జరిగింది. ఆ తరువాత వెనుక నుంచి వస్తున్న మరి కొన్ని వాహనాలు రోడ్డుపై ఉన్న లారీని గమనించక ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టాయి. సినిమా ఫక్కీలో దాదాపు పది వాహనాలకు పైగా ఢీకొని పలువురు గాయాల పాలయ్యారు. అందిన సమాచారం ఇంకొన్ని సమాచారం అందాల్సి ఉంది.

latest telugu newsTelugu breaking newstelugu news