FbTelugu

ఆపరేషన్ చేయించుకుంటున్నా… అమితాబ్!

ముంబయి: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ విషయాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.

ఏ వ్యాధి కారణంగా ఆపరేషన్ చేయించుకుంటున్న విషయాన్ని చెప్పలేదు. ఆపరేషన్ వార్త బయటకు వచ్చిన తరువాత ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. 78 సంవత్సరాల వయస్సు ఉన్న అమితాబ్ కు ఏమైందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆపరేషన్ విజయవంతం కావాలని ప్రార్థనలు చేస్తున్నామని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. 1982 లో కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా గాయమైనప్పుడు, ఆ తరువాత 2005 లో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నప్పడు ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.