FbTelugu

బిగ్ బీ కి ఎంత రెమ్యునరేషనో?

ముంబై: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వయసు పెరిగినా యువ హీరోలతో పారితోషికంలో పోటీపడుతున్నారు. వైజయంతి మువీస్ పతకాంపై ఒక భారీ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 40 రోజుల కాల్ షీట్లు ఇచ్చారు. కథ నచ్చడంతో అన్ని రోజుల పాటు కాల్ షిట్లు ఇచ్చారని అంటున్నారు. రూ.400 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్నది. అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ రూ.25 కోట్ల వరకు ఉండగా, హీరోయిన్ దీపికా పదుకునే కు కూడా అంతే మొత్తం చెల్లిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన తీరు తెన్నులను వివరిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ కు మెయిల్ పంపించాడు. హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.