FbTelugu

‘ఆ వార్త విని కుప్ప కూలాను’: అమితాబ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రిషి కపూర్ మరణ వార్త విని కుప్పకూలానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేధికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రిషి కపూర్ నిన్న రాత్రి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతడు 2018 లోనే న్యూయార్క్ లో క్యాన్సర్ చికిత్స పొందాడు. ప్రస్తుతం బాలీవుడ్ రాణిస్తున్న రణ్ బీర్ కపూర్ రిషి కపూర్ కుమారుడే. బాబి సినిమాతో బాలీవుడ్ లో రిషికపూర్ ఎంట్రీ ఇచ్చారు.

You might also like