FbTelugu

అమితాబ్ బచ్చన్ డిశ్చార్జీ

ఇంకా హాస్పిటల్ లోనే అభిషేక్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇవాళ నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. పాజిటివ్ రిపోర్టు రావడంతో గత నెల 11వ తేదీన తండ్రీ, కొడుకు హాస్పిటల్ లో చేరారు.
ఈ మేరకు ట్విట్టర్ లో అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రార్థనలతో అమితాబ్ బచ్చన్ కోలుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇకనుంచి ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు అని పేర్కొన్నారు.

తనకు ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయని అందుకే హాస్పిటల్ లో ఉంటున్నట్లు తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలో ఇంటికి చేరుకుంటానని అభిషేక్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం అభిషేక్ భార్య, ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని డిశ్చార్జీ అయిన విషయం తెలిసిందే.

You might also like