FbTelugu

నేడు గ్రేటర్ లో అమిత్ షా పర్యటన

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లోని వారాసిగూడలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం బీజేపీ ముఖ్యనేతలతో గ్రేటర్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.

అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అమిత్ షా భద్రతలో కేంద్ర బలగాలు కూడా పాలు పంచుకుంటున్నాయి. భద్రత ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.