FbTelugu

ఎట్టకేలకు అమిత్ షా కు నెగెటివ్

ఢిల్లీ: మొత్తానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా నెగెటివ్ రిపోర్టు రావడంతో బీజేపీ శ్రేణులు ఊరట చెందారు.

ఈ నెల 2వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయన ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ లో చేరారు. వారం రోజులకే ఆయనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందంటూ ఢిల్లీ బీజేపీ నాయకుడు చేసిన ట్వీట్ దుమారం లేపింది. ఆయనకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని, కోలుకుంటున్నారని కేంద్ర హోం శాఖ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్ ప్రకటనతో ఆయన తన ట్వీట్ తొలగించారు. తాజాగా సేకరించిన నమూనాలు పరీక్షించగా అమిత్ షా కు నెగెటివ్ వచ్చిందని హాస్పిటల్ ప్రకటించింది.

You might also like