FbTelugu

భైంసా అల్లర్లపై అమిత్ షా ఫోన్

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భైంసా పట్టణంలో చెలరేగిన అల్లర్లపై నివేదిక అడిగారు. అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై అమిత్ షా సహచర మంత్రి జి.కిషన్ రెడ్డితో వాకబు చేశారు.

నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం జరిగిన అల్లర్లలో బాధితులకు న్యాయం జరగాలని ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ అన్నారు. హింసకు పాల్పడిన వారిలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ మంత్రి, డీజీపీలను ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని, సమాజాభివృద్ధిలో శాంతి, సామరస్యాలు కీలకమని ఆయన స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.