FbTelugu

అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

తిరుపతి: దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు హాజరయ్యేందుకు తిరుపతి రావాల్సిన అమిత్ పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యింది.
ఈనెలలో 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

సమావేశం నిర్వహణపై తమినాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం పంపించారు. అమిత్ షా రానుండంతో ఏపీ ప్రభుత్వం తిరుపతి లో కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో అమిత్‌షా తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఏపీ ప్రభుత్వానికి సమాచారం పంపించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.