FbTelugu

చైనా చర్యలపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: చైనా ఆగడాలపై అగ్రరాజ్యం అమెరికా మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సరిహద్దులో మితిమీరి చొచ్చుకు వచ్చేందుకు ప్రవర్తిస్తుండడం, భూటాన్ పై చైనా తాజా వాదనలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీవ్రంగా స్పందించారు.

చైనాలో కరోనా వైరస్ పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించిన ప్రారంభం నుంచి అమెరికా బహిరంగానే చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా చైనా మాత్రం తనపై ఉన్న నిందలను పక్కదారి పట్టించేందుకు గానూ సరిహద్దు దేశాలపై దురాక్రమణలకు పాల్పడుతూ.. దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది.

You might also like