FbTelugu

సైన్యం దించడం మినహా మరో మార్గం లేదు…

వాషింగ్టన్: ఇండియాలో కరోనా వైరస్ వల్ల నెలకొన్న అసాధరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని దించడంతో పాటు ఇతర ఇతర బలగాలను వినియోగించాలని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచి స్పష్టం చేశారు.
కంటైన్మెంట్ జోన్లలో సైన్యం సాయంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాలే కాకుండా సిబ్బంది కోసం ఇతర దేశాల సహాయాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి తక్షణమే కొన్ని వారాలు పూర్తి లాక్ డౌన్ విధించాలని స్పష్టం చేశారు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్ వంటి దేశాలు లాక్ డౌన్ నిర్ణయాలతోనే వైరస్ ను కట్టడి చేశారన్నారు. పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయడం వల్ల కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయవచ్చని అన్నారు. యుద్ద సమయాల్లో ఏర్పాటు చేసుకున్నట్లుగానే తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని ఆంటోని ఫౌచి అన్నారు.

ఇండియాలో రోజుకు మూడున్నర లక్షల పైచిలుకు కేసులు నమోదు అవుతున్నందున భారీ సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా కేసులు పెరుగుతున్న కొద్దీ రోగుల సంరక్షణ చూసుకోవడం ఇబ్బందిగా మారుతుందని, ఇలాంటి సమయంలో ఆక్సిజన్, వైద్య సదుపాయాల కొరత ఏర్పడ్డం అసాధారణ పరిస్థితులకు దారితీస్తుందని ఆయన ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఫౌచిక కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని, అమెరికా, రష్యా దేశాల్లో విక్రయిస్తున్న వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని ఇండియాకు ఆంటోని ఫౌచి సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.