FbTelugu

అమెరికా పౌరులు స్వేచ్ఛగా తిరగొచ్చు: బైడెన్

వాషింగ్టన్: అమెరికా దేశంలో పౌరులు స్వేచ్ఛగా తమకు నచ్చిన ప్రాంతంలో గతంలో మాదిరి తిరగవచ్చు. ఇక నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు ఇకనుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నవారి పట్ల కరోనా ఆంక్షలు సడలించాలని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రభుత్వం సిడిసిని కోరింది. సాధారణ జీవనం గడిపేలా సిడిసి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసిన వారు కార్యాలయాలు, పాఠశాలలు, పని ప్రాంతాలలో మాస్క్ లేకుండా తిరగవచ్చు. జనసమర్థం, బస్టాండ్లు, విమానాశ్రయాలు, దవాఖానాలు ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించింది. మాస్క్ నిబంధన ఎత్తివేతపై అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. మెజారిటీ అమెరికన్లకు వ్యాక్సిన్లు వేయడంతో సాధించిన అసాధారణ విజయం మూలంగానే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. అమెరికా లో ఈరొజు గొప్ప మైలు రాయి అని బైడెన్ అభివర్ణించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.