FbTelugu

మయన్మార్ పై పెద్దన్న ఆగ్రహం

వాషింగ్టన్: మయన్మార్ లో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించేందుకు పెద్దన్న అమెరికా రంగంలోకి దిగాడు. సైనిక ప్రభుత్వ అరాచకాలను నిలువరించేందుకు ప్రత్యక్షంగా చర్యలు చేపట్టింది.

2013లో ఇరు దేశాల మధ్య ట్రేడ్ అండ్ ఇన్వస్ట్ మెంట్ ప్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ఒప్పందం కుదిరింది. సైనిక చర్యతో దీన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రకటించారు. ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయంతో ఆర్థికపరమైన ఆంక్షలు నిలిచిపోతాయి కాని ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్యం మాత్రం కొనసాగుతుంది. సైనిక చర్యకు వ్యతిరేకంగా యూకె కూడా ఆంక్షలు విధించింది. మయన్మార్ లో తయారీ అయ్యే ఉన్ని దస్తులు, గృహోపకరణాలకు యూరప్ దేశాల్లో మంచి డిమాండ్ ఉండనున్నది. ఆంక్షల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.