FbTelugu

భారత్ కు అమెరికా భరోసా!

వాషింగ్టన్: భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే రష్యా దేశం ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వచ్చింది. మేము కూడా సాయం చేస్తామంటూ అమెరికా ప్రకటించింది.

దేశంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత తీర్చేందుకు మేమున్నామని, రెండు వారాల్లో చేరవేస్తామని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఒక కార్యక్రమంలో అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంధోని ఫౌచి ప్రసంగిస్తూ, భారత్ లో మహమ్మారిని అరికట్టేందుకు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సిడిపి) సాంకేతిక సహకారం అందించి సహాయ పడుతుందని తెలిపారు. దేశంలో ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు పెరుగుతుండడంతో సాయం చేయాల్సిందిగా అక్కడి ఎన్ఆర్ఐ లు ప్రెసిడెంట్ జోసెఫ్ ఆర్ బైడెన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. పలువురు చట్టసభ సభ్యులతో పాటు ఎన్ఆర్ఐలు భారత్ కు అండగా నిలవాలని బైడెన్ కు వినతులు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్ పరికరాలు, రెమిడెసివిర్ ఇంజక్షన్లను పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంథోనీ ఫౌచీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.