FbTelugu

మళ్లీ ఏపి సరిహద్దులో అంబూలెన్స్ లు నిలిపివేత

హైదరాబాద్: ఏపి నుంచి వస్తున్న కరోనా పాజిటివ్ పేషెంట్ల అంబూలెన్స్ లు, కరోనా రోగుల వాహనాలను తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. రెండు రోజులు అనుమతించిన పోలీసులు మళ్లీ నిలిపివేయడంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పంచలింగాల చెక్ పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు రాయలసీమ నుంచి వస్తున్న 20 అంబూలెన్స్ లను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. అనుమతి పత్రాలు లేనందున హైదరాబాద్ కు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేయడంతో అక్కడే కరోనా పేషెంట్లు పడిగాపులు కాస్తున్నారు. ఇద్దరు రోగుల పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. ఒకరు కడప కాగా మరొకరు కర్నూలు జిల్లా నంద్యాల అని తెలిసింది. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వినోద అనే వృద్ధురాలికి పక్షవాతం వచ్చింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. పరిస్థితి విషమంగా ఉంటే ఆంక్షలేంటని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. పేషెంట్లను వదిలివస్తున్న అంబులెన్స్‌లను నిలిపివేయడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా పేషెంట్లకు ముందే ఆసుపత్రిలో అడ్మిషన్ తీసుకోవాలని నిబంధన విధించింది. ఇతర రాష్ట్రాల రోగుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ 040-24651119, 9494438351 కు ఫోన్ చేయాలి. ఆసుపత్రి నుంచి అడ్మిషన్ లెటర్ ఉంటే తప్ప రాష్ట్రంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.