FbTelugu

అంబూలెన్స్ సిబ్బందే బంగారం దొంగిలించారు

రామగుండం: పెద్దపల్లి జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 2.3 కేజీల బంగారాన్ని 108 అంబూలెన్స్ సిబ్బంది దొంగిలించారని రామగుండం పోలీసు కమిషనర్ సత్యానారాయణ తెలిపారు.
రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వర్తకులు, సోదరులైన కొత్త శ్రీనివాసరావు, రాంబాబు దుర్మరణం పాలయ్యారని కమిషనర్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ డి.సంతోష్, గుమాస్తా గుండా సంతోష్ లకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారి కారు డివైడర్ ను ఢీకొనడంతో దాదాపు వంద అడుగుల దూరంలో ఉన్న సైన్ బోర్డును బలంగా తాకుతూ పక్కనున్న కాల్వలోకి పడిపోయిందని చెప్పారు. గాయపడిన వారిని 108 వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో వ్యాపారుల వద్ద 5.60 కేజీల బంగారం ఉందని వారి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది మాత్రం 3.30 కిలోల బంగారాన్ని మాత్రమే విచారణకు వచ్చిన ఎస్సై శైలజకు అప్పగించారు. మిగతా 2.30 కేజీల బంగారం ఎక్కడికి పోయిందనేది విచారణ చేపట్టారు. బంగారం మాయం కావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 24 గంటల్లోగా అసలు దొంగలను పట్టుకున్నామన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న 108 డ్రైవర్ లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నీషియన్ తాజుద్దీన్ 2.300 కేజీల బంగారాన్ని దాచిపెట్టారని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. మిగిలిన బంగారాన్ని పోలీసులకు ఇచ్చి నొక్కే ప్రయత్నం చేశారన్నారు.
అంబూలెన్స్ లో ఉన్న సిబ్బందిని పోలీసులు విచారించగా, వారు నిజాన్ని ఒప్పుకున్నారని వివరించారు. 108 సిబ్బంది అత్యాశ వారికి చెడ్డపేరు తీసుకొచ్చేలా చేసిందని సత్యనారాయణ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.