FbTelugu

పదవిలో ఉండే హక్కు ‘నిమ్మగడ్డ’కు లేదు: అంబటి

అమరావతి: రాజ్యంగ పదవిలో ఉండే అర్హత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.

ఈ నెల 13న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయినట్టు ఓ సీసీ టీవీ పుటేజీ బయటకు రావడంతో.. అంబటి నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండి రహస్యంగా రాజకీయ నేతలతో మీటింగ్ లు పెట్టడమేంటని ప్రశ్నించారు. మీడియాలో వస్తున్న వారి తతంగంపై ఎవరూ నోరు విప్పరేంటని ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.