FbTelugu

అఖిలప్రియ అరెస్టుపై స్పందించరేం? : అంబటి

* చంద్రబాబు, లోకేశ్ లపై అంబటి ఫైర్
అమరావతి: కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేయడం పట్ల టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతని తనయుడు నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని పరామర్శించిన టీడీపీ నేతలు అఖిలప్రియ అరెస్టయితే ఎందుకు పరామర్శించడం లేదన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టుని టీడీపీ నేతలు రాజకీయ వేధింపులుగా చిత్రీకరించారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.