FbTelugu

అంబానీ సోదరులపై రూ.25 కోట్లు జరిమానా

ముంబై: రిలయన్స్ కంపెనీ అధినేతలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తో పాటు వారి సంస్థలపై సెబి రూ.25 కోట్లు అపరాధ రుసుం విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ సమయంలో నిబంధనలను పాటించని కేసులో ఈ జరిమానా వేశారు.
ధీరూభాయ్ అంబానీ వ్యాపార సంస్థలను ఆయన కుమారులు ముకేశ్, అనిల్ 2005 సంవత్సరంలో పంచుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఇరువురు తగవులాడుకోవడంతో తల్లి కూర్చుని సర్దుబాటు చేశారు. పారిశ్రామిక పెద్దలు కూడా జోక్యం చేసుకుని రాజీ చేసిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, పర్సన్ యాక్టింగ్ ఇన్ కాన్సర్ట్ లు 2000 సంవత్సరంలో 6.83 శాతం వాటా కొనుగులో చేశారు. 5 శాతం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ప్రజలకు వెల్లడించాల్సి ఉండగా వెల్లడించలేదు. వెల్లడించకుండా గోప్యత పాటించినందుకు సెబి రూ.25 కోట్ల జరిమానా ను ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీకి విధించింది. అదే విధంగా ముకేశ్ భార్య, అనిల్ భార్య కు జరిమానా వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.