FbTelugu

అమెజాన్ ప్రైమ్ రూ.20 అంట… పారా హుషార్!

అమెజాన్ ప్రైమ్ నెలవారి సభ్యత్వం రూ.20 కే లభిస్తుందంటే ఎవరైనా లొట్టలేస్తారు. అదే విధంగా నెట్ ప్లిక్స్ సభ్యత్వం కూడా రూ.25కే ఇస్తున్నామంటూ సోషల్ మీడియాలో గ్రూపులు పెట్టి ఊదరగొడుతున్నారు.

ఇదేదో నిజమనుకుని పలువురు ఆ గ్రూపులో చేరిపోతున్నారు. ఈ ప్రకటనతో చేరిపోతున్న పలువురు డబ్బులు చెల్లించి సభ్యులై పోతున్నారు. ఓటీపీలు కూడా తీసుకుంటున్నారు.
టెలిగ్రామ్ లో ఓటీపీ బయ్యర్స్ సెల్లర్స్ పేరతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ గ్రూపును సెబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్నారు. ఈ గ్రూపులో జాయిన్ అని క్లిక్ చేస్తే స్వాగతం అంటూ సందేశం వస్తుంది. రూ.20 బదిలీ చేయగానే ఓటీపీ వస్తుంది. వర్చువల్ సిమ్ కార్డుతో ఇదంతా చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. సికింద్రాబాద్ లో ఒక యువతిని వేధించేందుకు వర్చువల్ సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ యువతి ఫిర్యాదు చేయగా ఈ గుట్టంతా బయటకు వచ్చింది. అసలు ఈ గ్రూపు ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పాలంటూ పోలీసులు టెలిగ్రామ్ కంపెనీకి లేఖ రాశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.