FbTelugu

హైకోర్టులో అమరరాజా సంస్థలకు ఊరట

అమరావతి: అమరరాజా సంస్థలను మూసివేయాలని ఏపి ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ అమరరాజా సంస్థ వేసి పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

ఏపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించడం లేదనే కారణంతో ప్రతిపక్ష పార్టీ ఎంపి గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థలను మూసివేయాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పిటీషన్ లో తెలిపారు. పిసిబి నిబంధనలు పాటిస్తున్నామని హైకోర్టు కు తెలిపింది. వాదోపవాదనల తరువాత అమరరాజా సంస్థల మూసివేతపై జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.