FbTelugu

మద్రాస్ హైకోర్టు సీజేగా అమరేశ్వర్ ప్రమాణం

చెన్నై: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహీ ప్రమాణం చేశారు. ఇవ్వాళ రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ జస్టిస్ అమరేశ్వర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం కె.పళని స్వామి, జస్టిస్ వినీత్ కోఠారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శణ్నుఘంతో పాటు పలువురు హాజరయ్యారు. జస్టిస్ అమరేశ్వర్ 1985లో న్యాయవాద పట్టా పొంది అలహాబాద్ హైకోర్టులో వకాలత్ ప్రారంభించారు. నవంబర్ 17, 2018 లో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

You might also like