FbTelugu

షర్మిల ను కలవనున్న అమరావతి రైతులు

అమరావతి: రాష్ట్ర రాజధాని కొనసాగించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు వైఎస్.షర్మిల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
అపాయింట్ మెంట్ ఇస్తే అమరావతి మహిళా రైతుల కొంతమంది ఆమెను కలువనున్నారు.

రాజధాని ప్రాంతంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై వారి బాధలు చెప్పుకోనున్నారు. ఈ ప్రాంత రైతులకు మద్దతుగా ఇక్కడ కూడా పోరాడాలని కోరనున్నారు. అలాగే 2019లో మా అన్నకి (వైఎస్.జగన్ మోహన్ రెడ్డి) ఓటేయండి రామన్న రాజ్యం వస్తుందని షర్మిల ప్రచారం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రామన్న రాజ్యం రాలేదని రావణరాజ్యం వచ్చిందని తెలపనున్నారు. మీరు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నామని అమరావతి రైతులు పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.