FbTelugu

ఆయన ముద్దులు, బొమ్మల బాబా: పూర్వ విద్యార్థి ఆరోపణ

చెన్నై: ఆయన నడిపే పాఠశాలలో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ పదాలకు చోటు లేదని… వాటి స్థానంలో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవాలని పూర్వ విద్యార్థి ఒకరు  శివశంకర్ బాబా (72) గుట్టు విప్పింది.

పూర్వ విద్యార్థి ఒకరు ఆన్ లైన్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివశంకర్ బాబా లీలలను పూసగుచ్చి చెప్పి భండారం బట్టబయలు చేసింది. తనను తాను కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిగా ప్రకటించుకుని సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూలు నడుపుతున్నారని తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో ఆయన నడిపే పాఠశాల అహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తుందని, ఈ ప్రాంగణంలోనే హిందూ, ముస్లిం దేవాలయాలు ఉన్నాయని వివరించారు. ఆయనను దైవాంశ సంభూతిడిగా తల్లిదండ్రులు భావించి గౌరవిస్తారని తెలిపింది. అందుకే ఆయన చేసే అశ్లీల పనులకు ఎవరూ అడ్డుచెప్పరన్నారు. క్లాస్ రూమ్ లోకి వచ్చి పాఠాలు చెప్పే బదులు బ్లాక్ బోర్డుపై బూతు బొమ్మలు గీస్తారని చెప్పింది. ముద్దులు పెట్టని అమ్మాయిలకు తక్కువ మార్కులు వేస్తారని చెప్పింది.

శివశంకర్ బాబాపై లైంగిక ఆరోపణలు రావడంతో తమిళనాడు సిబి సిఐడి అధికారులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. ఛాతి నొప్పిగా ఉందని చెప్పడంతో చెంగల్పట్లు లోని గవర్నమెంటు హాస్పిటల్ కు తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ గవర్నమెంటు హాస్పిటల్ కు తరలించారు. బాబా శిష్యురాలు సుస్మితను కూడా సిబి సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది బాలికలను నచ్చచెప్పి బాబా గదికి తీసుకువెళ్లేది. బాబా గదిలోని కంప్యూటర్, హార్డ్ డిస్క్, సిసిటివి రికార్డింగ్ సిడి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామల్లాపురం మహిళా పోలీసు స్టేషన్ లో శివశంకర్ బాబాకు పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.