FbTelugu

అల్లూరి అనుచరుడు బాలుదొర మృతి

తూ.గో.జిల్లా: మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామారాజుకు సేవలందించిన బీరబోయిన బాలుదొర మృతిచెందాడు. రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బాలు దొర వయస్సు 111 సంవత్సరాలు.

వయస్సు మీదపడడం, అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా ఆయన మంచానికి పరిమితమయ్యారు. 1924లో అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తున్న సమయంలో బాలుదొర బాలుడు. అప్పట్లో అడవుల్లో ఉన్న రామరాజు బృందానికి ఆహార పదార్థాలు తీసుకువెళ్లి ఇచ్చేవాడినని గుర్తు చేసుకునేవారు. ఈ తరం విద్యార్థులకు స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడింది వివరించేవాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.