FbTelugu

బెర్త్ ఉంటే తప్ప స్టేషన్ కు రాకూడదు: రైల్వే

హైదరాబాద్: పండుగ ప్రత్యేక రైళ్లలో బెర్త్ ఖరారు అయితే తప్ప స్టేషన్ లోనికి అనుమతించరు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. టికెట్ కన్ఫర్మ్ అయితే తప్ప స్టేషన్ వద్దకు రావొద్దని స్పష్టం చేసింది.
రైలు ఎక్కే ప్రతి ప్రయాణీకుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉన్నవారు ప్రయాణానికి దూరంగా ఉండాలి. కరోనా పాజిటివ్ వ్యక్తులను రైలులోకి, స్టేషన్ ఆవరణలోకి అనుమతించడం లేదని తెలిపింది. స్టేషన్లలో నియమించిన ఆరోగ్య బృందం ప్రయాణీకులను అనుమతించనట్లయితే సదరు ప్రయాణీకుడిపై శిక్షలు ఉంటాయని పేర్కొంది.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మలమూత్ర విసర్జన చేస్తే నేరంగా పరిగణిస్తారు. స్టేషన్లు, పరిసర ప్రాంతాలు, రైళ్లలో ఆరోగ్యం పై ప్రభావం చూపే విధంగా ప్రవర్తిస్తే శిక్షార్హం అని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.