FbTelugu

కొవాగ్జిన్ కు అనుమతివ్వండి: భారత్ బయోటెక్

హైదరాబాద్: కరోనా కోసం అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా భారత్ బయోటెక్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.
ఈ వ్యాక్సిన్ ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్), నేషల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్త సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దేశా వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ను మూడో దశ ప్రయోగాలు 22వేల మంది వాలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. మూడో దశ విజయవంతం అయినట్లు నిరూపణ కాగానే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపనున్నది.

వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మూడు వ్యాక్సిన్ కంపెనీలను సందర్శించారు. ఆ మరుసటి రోజు కంపెనీ అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్ ను బహిరంగ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న పూణే కు చెందిన సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ నెల 6న కొవిషీల్డు వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం కోసం కేంద్రానికి దరఖాస్తు సమర్పించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.